శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 13:01:29

కిడ్నీ సమస్యపై అప్రమత్తంగా ఉండాలి : గవర్నర్‌

కిడ్నీ సమస్యపై అప్రమత్తంగా ఉండాలి : గవర్నర్‌

హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ వైద్య కళాశాలలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి కళాశాలను చాలా అభివృద్ధి చేశారని గవర్నర్‌ ప్రశంసించారు. ఒక నెఫ్రాలజిస్ట్‌ భార్యగా రోగుల బాధలు చూశాను అని తెలిపారు. కిడ్నీ సమస్యపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి వైరస్‌ మన దరిచేరదు అని గవర్నర్‌ స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో కిడ్నీ రోగుల కోసం 45 డయాలసిస్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్లో 5 నుంచి 10 వరకు బెడ్లు ఉన్నాయి.


logo