శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 08, 2020 , 15:23:17

మాస్కులు లేకుండా తిరిగే వాళ్లను గుర్తిస్తున్నాం : డీజీపీ

మాస్కులు లేకుండా తిరిగే వాళ్లను గుర్తిస్తున్నాం : డీజీపీ

హైదరాబాద్‌ : కరోనా నియంత్రణకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మాస్కు ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు మాస్కులు ధరించకుండా యథేచ్చగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో మాస్కులు ధరించని వారిని గుర్తించేందుకు కృత్రిమ మేధస్సును ఉపయోగించాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది.

ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో మాస్కులు ధరించకుండా తిరిగే వాళ్లను గుర్తిస్తున్నామని డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. దీని కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నామని ఆయన చెప్పారు. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో వినూత్న ప్రయోగం చేపట్టామని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా జనసమూహాల పరిశీలన కూడా జరుగుతుందన్నారు. త్వరలోనే హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. 


logo