శనివారం 06 జూన్ 2020
Telangana - May 08, 2020 , 14:43:42

ప్రతి కూలీకి పని కల్పించాలి : మంత్రి ఎర్రబెల్లి

ప్రతి కూలీకి పని కల్పించాలి : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్:  జిల్లాలోని పర్వతగిరి ఆవు కుంట చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను  పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. మంత్రి కూలీలతో పాటు  గడ్డపార పట్టి మట్టిని  తవ్వారు. ఉపాధి పనులు ఎలా సాగుతున్నాయని అరా తీశారు. కరోనా నేపథ్యం లో  సామాజిక భౌతిక దూరం పాటిస్తూ, పనులు చేయాలని సూచించారు. ఇదే సమయంలో ఉపాధి హామీ పనుల విషయమై, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత తో మాట్లాడిన మంత్రి ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించాలన్నారు. ఉపాధి హామీ పనులు కోసం సీఎం కేసీఆర్   రూ.170 కోట్లు విడుదల చేశారు. అందరికీ ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్య మన్నారు. అందుకనుగుణంగా అధికారులు కూలీలకు పనులు కల్పించి రాష్ట్రంలో ఒక్క నిరుపేద కూడా ఆకలితో అలమటించ కూడదని మంత్రి పేర్కొన్నారు.


logo