శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 10, 2020 , 17:27:29

రైతులు సామాజిక దూరం పాటించాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

రైతులు సామాజిక దూరం పాటించాలి :  మంత్రి నిరంజన్‌ రెడ్డి

వనపర్తి : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. శ్రీరంగాపూర్‌ మండల కేంద్రంలో పీఏసీఎస్‌ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. అయితే వ్యవసాయ పనులు మాత్రం ఆగిపోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారు. పండించిన పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరాన్ని పాటించి అధికారులకు, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, జడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్‌, ఎంపీపీ గాయత్రి, జిల్లా సహకార అధికారి కోదండరాములు, జిల్లా పౌరసరఫరాల అధికారి రేవతి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌ పాల్గొన్నారు.


logo