గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 16:31:40

పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు.. ఆహారం అందజేత

పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు.. ఆహారం అందజేత

హైదరాబాద్‌ : తీవ్ర వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో జన జీవనం స్తంభించింది. పలు ప్రాంతాలో వరదలో చిక్కుకుపోయాయి. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా ముంపునకు గురైన ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ఆహారం అందిస్తున్నారు. అలాగే పలు చోట్ల ప్రభుత్వం సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో వారికి ఆహారంతో పాటు అవసరమైన వైద్య సదుపాయం కల్పిస్తున్నారు.

అలాగే ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ముంపు బాధితులతో మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అదుకుంటామని, ఆందోళనపడొద్దని సూచించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


వీడియోల కోసం క్లిక్‌  చేయండి.. 

హైదరాబాద్‌లో పరవళ్లు తొక్కుతున్న మూసీ..

చరిత్రలో ఎన్నడూ లేనంతగా మూసీకి వరద..

హుస్సేన్ సాగ‌ర్‌కు భారీ వ‌ర‌ద.


logo