గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 18:03:33

యాదాద్రిలో నిత్యకల్యాణ వైభవం

యాదాద్రిలో నిత్యకల్యాణ వైభవం

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మహామంటపంలో ఆలయ అర్చకులు సుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రంగా నిర్వహించారు. బాలాయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి అర్చకులు స్వామివారికి సుప్రభాతం, ఆరాధన చేపట్టారు. పంచామృతాలతో అభిషేకించి పట్టువస్ర్తాలు ధరింపజేసి అర్చన జరిపారు. ఉత్సవమూర్తులను తులసీ దళాలతో అర్చించి అష్టోత్తరం నిర్వహించారు. స్వామివారికి సాయంత్రం, రాత్రి ఆరాధన, శయనోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.