శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 21:06:58

కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి ఈటల ఫోన్‌

కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి ఈటల ఫోన్‌

హైదరాబాద్‌:  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల  రాజేందర్‌ ఫోన్‌లో  మాట్లాడారు.  తక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించలేకపోయిన మెడికల్‌ పీజీ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని మంత్రి ఈటల కోరారు. కరోనా డ్యూటీలో సేవలందించిన వారికి గ్రేస్‌ మార్కులు ఇచ్చి ఉత్తీర్ణత పొందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.  '1040 మంది వైద్య విద్యార్థులు మెడికల్‌ పీజీ పరీక్షలకు హాజరయ్యారు. 100 మంది వరకూ ఫెయిల్‌ అయినవారిని ప్రమోట్‌ చేయాలి.' అని ఈటల కోరారు. logo