శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 24, 2020 , 01:42:20

కార్మికుల వైద్యకేంద్రంగా నాచారం ఈఎస్‌ఐ

కార్మికుల వైద్యకేంద్రంగా నాచారం ఈఎస్‌ఐ

  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

ఉప్పల్‌, నమస్తే తెలంగాణ: నాచారం ఈఎస్‌ఐని కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించే కేంద్రంగా  తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన  నాచారంలోని ఈఎస్‌ఐ దవాఖానను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ఈఎస్‌ఐలో అత్యాధునికమైన సదుపాయాలు, నిపుణులైన వైద్యులు ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. కొవిడ్‌ చికిత్స అందించేందుకు ఈఎస్‌ఐ దవాఖానను వినియోగించుకొనేందుకు పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాచారం కార్పొరేటర్‌, తదితరులు పాల్గొన్నారు. logo