గురువారం 16 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 20:59:46

కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స: మంత్రి ఈటల

కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స: మంత్రి ఈటల

హైదరాబాద్:  కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స అందిస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇంట్లోనే కరోనా చికిత్సకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు. 

'ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య పెరిగితే ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. జీవనోపాధి కోల్పోకూడదని మాత్రమే లాక్‌డౌన్‌ ఎత్తివేశాం. అవసరం లేకుండా బయటికి వచ్చి ప్రాణాలమీదకి తెచ్చుకోవద్దు. ప్రజలు ఎక్కువగా బయటకు రావడంతో కరోనా వ్యాప్తి పెరిగింది. వృద్ధులకు, ఆరోగ్య సమస్యలున్నవారికి కరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కరోనా సోకకుండా ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలి. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ హైదరాబాద్‌లో చికిత్స అందించడం అసాధ్యం. జిల్లా కేంద్రాల్లోనే ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిలోనే కరోనా చికిత్స అందిస్తామని' మంత్రి పేర్కొన్నారు.  


logo