మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 01:27:46

ఖమ్మం బాలికకు మెరుగైన వైద్యం: ఈటల

ఖమ్మం బాలికకు మెరుగైన వైద్యం: ఈటల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఖమ్మంలో లైంగికదాడికి గురైన 13 ఏండ్ల బాలికకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బుధవారం అధికారులను ఆదేశించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసిన ఆయన.. తొందరగా కోలుకునేలా చూడాలని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌కు సూచించారు.

నిందితుడిని ఉరితీయాలి: సీపీఐ

బాలికపై లైంగికదాడికి పాల్పడి, నిప్పంటించిన కిరాతకుడిని ఉరితీయాలని సీపీఐ జాతీ య కార్యదర్శి కే నారాయణ డిమాండ్‌ చేశా రు. ఉస్మానియా దవాఖానలో బాధితురాలిని ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ మహిళా సమాఖ్య కార్యదర్శి కృష్ణకుమారితో కలిసి నారాయణ పరామర్శించారు.


logo