సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 13:15:12

నెరవేరిన ప్రజల చిరకాల కోరిక

నెరవేరిన ప్రజల చిరకాల కోరిక

మంచిర్యాల :  ఎన్నో ఏండ్ల పట్టణ ప్రజల కల నేరవేరింది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో పట్టణంలో తరచూ ప్రమాదాలు సంభవించేవి. ప్రమాదాలకు చెక్ పెడుతూ పట్టణంలో ఐబీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ సిస్టాన్ని మంచిర్యాల కలెక్టర్ భారతి హోలికేరి, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీసు సత్యనారాయణ, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ భారతి హోలికేరి  మాట్లాడుతూ.. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ప్రారంభించినట్లు తెలిపారు. 

మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటం వలన డీఎంఎఫ్ టీ  ఫండ్స్ నుంచి రూ. 6 లక్షలు ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు కోసం కేటాయించామని పేర్కొన్నారు. మంచిర్యాల లాంటి పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదని, రోడ్డు ప్రమాదాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు.  ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్, రోడ్ డివైడర్  ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.  రామగుండం సీపీ సత్యనారాయణ మాట్లడుతూ.. మంచిర్యాల  జిల్లా కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి అధిక వాహనాల రాకపోకలు ,రద్దీ కారణంగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో కలెక్టర్ నిధుల నంచి రూ. 6 లక్షల తో ఐబీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.  ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.   ఈ సిగ్నల్స్ వల్ల ప్రమాదాలు తగ్గుతాయన్నారు.  ఒక సిగ్నల్స్ ఏర్పాటుతో 10 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ కి సమానంగా ఉంటుందని చెప్పారు.  కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి,  ఏసీపీ నరేందర్, మంచిర్యాల ముత్తి లింగయ్య, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు.logo