సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 17:52:01

నిజామాబాద్ పట్టణంలో కేసీఆర్ కాలనీ ఏర్పాటు

నిజామాబాద్ పట్టణంలో కేసీఆర్ కాలనీ ఏర్పాటు

నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో 1,016 నివాస గృహ సముదాయల వారంతా కలిసి తమ కాలనీకి కేసీఆర్ కాలనీగా నామకరణం చేశారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు భూ వివాదం కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. ఇన్నేండ్లు ఏ ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ నేపథ్యంలో హౌసింగ్ బోర్డు భూ వివాదం పరిష్కారం కోసం మాజీ ఎంపీ కవితను కలిసి స్థానికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 

కవిత చొరవతో సీఎం కేసీఆర్ సమస్యను పరిష్కరించారు. ఏండ్లుగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం లభించడంతో కాలనీ వాసులంతా ఆనందంతో ఉప్పొంగి పోయారు. సమస్యను చక్కదిద్దిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతగా తమ కాలనీకి సీఎం పేరు పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.


logo