ఆదివారం 31 మే 2020
Telangana - May 20, 2020 , 21:23:39

రాష్ట్రంలో ఐదు ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటు

రాష్ట్రంలో ఐదు ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఐదు ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు ఐదు ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏర్పాటు కానున్న యూనివర్సిటీ వివరాలిలా ఉన్నాయి. 1. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుత్భుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో మహింద్రా యూనివర్సిటీ, 2. మెదక్‌ జిల్లా సదాశివ్‌పేట మండలం కంకోల్‌లో వోక్సెన్‌ యూనివర్సిటీ, 3. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దూళపల్లి ఏరియా  మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, 4. వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ, 5. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లో అనురాగ్‌ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది.


logo