గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 12:10:24

షాద్‌నగర్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

షాద్‌నగర్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

రంగారెడ్డి  : చిన్నారులు, మహిళలపై జరుగుతున్న లైంగికదాడుల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకే  ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేందర్ చౌహన్ తెలిపారు. షాద్‌నగర్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టును  ప్రధాన న్యాయమూర్తి ఆన్‌లైన్‌లో ప్రారంభించి మాట్లాడారు. అన్ని రాష్ట్రాలు కూడా కోర్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాయని తెలిపారు. కొవిడ్ కారణంగా కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతుంది. 

రాష్ట్రంలో 6,173 ఫోక్సో కేసులు పెండింగ్ ఉండగా.. జిల్లాలో 887 ఉన్నాయని వివరాలను వెల్లడించారు. బార్ అసోసియేషన్, పోలీస్, విచారణ సంస్ధలు సహకారంతోనే త్వరితగతిన కేసులు పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగితేనే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఆరు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రేమావతి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, జిల్లా ఏఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


logo