గురువారం 04 జూన్ 2020
Telangana - May 07, 2020 , 19:52:18

అక్రమ కలప నియంత్రణకు చెక్ పోస్ట్ ఏర్పాటు

 అక్రమ కలప నియంత్రణకు చెక్ పోస్ట్ ఏర్పాటు

 హైదరాబాద్‌ : అక్రమ కలప రవాణాను నియంత్రించడానికి సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీసీఎఫ్ పీవీ రాజారావు తెలిపారు. ఇతర జిల్లాల నుంచి అశ్వరావుపేట మీదుగా ఆంధ్ర ప్రాంతానికి కలప అక్రమ రవాణా అవుతుందన్నారు. అందుకుగాను రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నందిపాడు గ్రామం వద్ద చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ మేరకు ఆయన అశ్వరావుపేటలో పర్యటించారు. ఆయన వెంట ఎఫ్ డీవో తిరుమలరావు, రేంజర్ హుస్సేన్ ఉన్నారు.


logo