బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 01:19:45

గృహ హింస బాధితులకు బాసటగా..

గృహ హింస బాధితులకు బాసటగా..

  • మహిళా భద్రతా విభాగంలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఏర్పాటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గృహహింస బాధితులకు బాసటగా నిలిచేందుకు రాష్ట్ర మహిళా భద్రతావిభాగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. డయల్‌ 100కు వచ్చే గృహహింస ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరిస్తున్నది. బాధిత మహిళల్లో మనోధైర్యం, భరోసా నింపేందుకు టెలిఫోన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తున్నది. ఇందుకోసం 25మంది బృందంతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్టు మహిళా భద్రతావిభాగం ఇంచార్జి, ఐజీ స్వాతిలక్రా తెలిపారు. ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళం, కన్నడ, మలయాళం సహా వివిధ భాషలకు చెందిన కౌన్సెలర్లు సేవలందిస్తున్నట్టు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో గృహహింస కేసులు తగ్గుముఖం పట్టాయని, మద్యం దుకాణాలు తెరిచిన తర్వాత పెరుగుతున్నట్టు తెలుస్తున్నదన్నారు. ఇలాంటి కేసుల పరిష్కారానికి మహబూబ్‌నగర్‌ ఎస్పీ రెమారాజేశ్వరి స్పెషల్‌ మొబైల్‌ సేఫ్టీ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఇందుకోసం కేటాయించిన నంబర్‌కు ఫిర్యాదుచేస్తే పోలీస్‌ బృందం బాధిత మహిళ ఇంటికివెళ్లి పరిస్థితులను చక్కబెడుతున్నది.logo