సోమవారం 01 జూన్ 2020
Telangana - May 04, 2020 , 13:35:43

తొర్రూరులో పేదలకు నిత్యావసరాలు పంచిన మంత్రి ఎర్రబెల్లి

తొర్రూరులో పేదలకు నిత్యావసరాలు పంచిన మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్‌‌: మహబూబాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొర్రూరు మండలం మాటేడులో పలువురు దాతలు అందించిన నిత్యావసరాలను పేదలకు పంపిణీచేశారు. అనంతరం తొర్రూరులో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, శారదా స్కూల్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసరాలను కూడా మంత్రి ఎర్రబెల్లి తన చేతుల మీదుగా పంచిపెట్టారు. అనంతరం తొర్రూరు అతిథి గృహంలో దీప డిజిటల్స్‌ అనిల్‌ అందించిన నిత్యవసరాలను పేపర్‌ బాయ్స్‌కు పంపిణీ చేశారు. 

అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ వేళ నిరుపేదలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన దాతలకు అభినందనలు చెప్పారు. పేదలను ఆదుకోవడానికి ఇది సరైన సమయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా చాలామంది ముందుకు రావాలని ఆయన సూచించారు. ఆర్థికంగా ఎంత నష్టం వాటిల్లినా సరే ప్రజల ప్రాణాలు రక్షించడమే ముఖ్యమనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నారని మంత్రి చెప్పారు. logo