శనివారం 30 మే 2020
Telangana - Apr 01, 2020 , 00:53:25

అందరికీ నిత్యావసరాలు

అందరికీ నిత్యావసరాలు

-ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: పొట్టకూటికి వచ్చిన పొరుగు రాష్ర్టాల వారిని ప్రభుత్వం అన్నివిధాలుగా అదుకుంటుందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో వలసకూలీలకు సామగ్రిని పంపిణీచేశారు. సిద్దిపేట శివారు మందపల్లిలో 360 మంది, నర్సాపురంలో 320 మంది, గజ్వేల్‌ శివారు ముట్రాజ్‌పల్లిలో 680 మంది, మర్కూక్‌లో 300మంది, తున్కిబొల్లారంలో 600 మంది వలస కార్మికులకు మంత్రి 12 కిలోల చొప్పున బియ్యంతోపాటు రూ.500 నగదు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.logo