ఆదివారం 31 మే 2020
Telangana - May 11, 2020 , 20:00:20

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు దాతలు ముందుకువచ్చి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ జర్మనీ ప్రతినిధుల సౌజన్యంతో.. స్థానికుల సహకారంతో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నగరంలోని చైతన్యపురిలో పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేదలైన 40 కుటుంబాలకు పది రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలోనూ 101 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా సహాయం పొందిన వారు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ జర్మనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ జర్మనీ ప్రతినిధులను ప్రోత్సహిస్తున్న మహేష్‌ బిగాలకు వారు ధన్యవాదాలు తెలిపారు. logo