మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 27, 2020 , 13:48:25

'కరోనా'పై వ్యాసరచన, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలు

'కరోనా'పై వ్యాసరచన, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలు

హైదరాబాద్‌ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌పై వ్యాసరచన, నినాదాలు, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు బంధన్‌ సంస్థ చైర్‌పర్సన్‌, రచయిత్రి, పాత్రికేయురాలు వనిత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా ఎవరైనా పాల్గొనవచ్చు అని చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు ఎలాంటి ప్రవేశ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

కరోనా కట్టడికి విలువైన సూచనలతో కూడిన వ్యాసాలను 200 పదాలకు మించకుండా రాసి పంపాలి. ప్రజల్లోకి ప్రభావంతంగా తీసుకెళ్లే.. నినాదాలను పది పదాలకు మించకుండా, తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో రాసి పంపొచ్చు. ఇక డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీల్లో పాల్గొనే వారు.. వాటర్‌, ఆయిల్‌ కలర్స్‌, పెన్సిల్స్‌ షెడ్స్‌ ఉపయోగించొచ్చు. పోటీదారులను 17 సంవత్సరాలు లోపు వారిని ఒక గ్రూపుగా, 18 నుంచి 35 సంవత్సరాల లోపువారిని ఒక గ్రూపుగా, 35 సంవత్సరాల పైబడిన వారిని ఒక గ్రూపుగా విభజిస్తామని రచయిత్రి వనిత తెలిపారు. ఈ పోటీలో తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదని ఆమె స్పష్టం చేశారు. పోటీలో పాల్గొనాలకునే వారు.. పోటీదారుని పూర్తి పేరు, వయస్సు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ను [email protected]కు ఏప్రిల్‌ 14, 2020 లోపు పంపాలి. 


logo
>>>>>>