బుధవారం 03 జూన్ 2020
Telangana - May 18, 2020 , 00:19:49

ఈఎస్‌ఐ స్టాఫ్‌నర్స్‌ దాతృత్వం

ఈఎస్‌ఐ స్టాఫ్‌నర్స్‌ దాతృత్వం

హన్మకొండ: కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ యువతి తన మొదటి మూడు నెలల వేతనం దాదాపు రూ.2.10 లక్షలను ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన తాటి అశ్లేష హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు.  ఈ మేరకు ఆమె తన మొదటి నెల జీతాన్ని నర్సింగ్‌ విద్య చదివిన కళాశాల వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలకు, రెండో నెల జీతం పుట్టిన ఊరు వెంకటపురం అభివృద్ధికి అందజేశారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న పెయింటర్స్‌, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు తన మూడో నెల వేతనాన్ని   ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌కు అందజేశారు.  సామాజిక సేవ కోసం వెచ్చించిన అశ్లేషను దాస్యం ఘనంగా సన్మానించారు. 


logo