శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 20:48:56

సుందిళ్ల బ్యారేజీని సందర్శించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌

సుందిళ్ల బ్యారేజీని సందర్శించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలోని సుందిళ్ల (పార్వతి) బ్యారేజ్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతతో కలిసి శనివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తూ శాశ్వత తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేలా రికార్డు సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసినట్లు చెప్పారు. వ్యవసాయం,  పరిశ్రమల అభివృద్ధితోపాటు రాష్ట్రంలో నీలివిప్లవం పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, ప్రజాప్రతినిధులు, నాయకులున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo