శనివారం 30 మే 2020
Telangana - May 19, 2020 , 11:12:52

దేవాదుల ప్రధాన కాలువను పరిశీలించిన ఎర్రబెల్లి

దేవాదుల ప్రధాన కాలువను పరిశీలించిన ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌: తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆయన ఈ రోజు  దేవాదుల ప్రధాన కాలువను పరిశీలించారు. దశాబ్దాల కల నేరవేరిందని, తన జీవితంలో ఈ ప్రాంతంలోని కాలువల్లో నీటిని చూస్తాననుకోలేదని చెప్పారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని తెలిపారు. ప్యాకేజీ-46లోని దక్షిణ ప్రధాన కాలువ ద్వారా ఐదు రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. దీనిద్వారా సంగెం మండలంలోని 12 గ్రామాల్లోని 18 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. మంత్రి వెంట వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.  


logo