శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 12:35:36

మంత్రి ఈటలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి

మంత్రి ఈటలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి

వరంగల్‌: రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం వరంగల్‌లో మంత్రి ఈటలను కలిశారు. ఈ సందర్భంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మంత్రి దయాకర్‌రావు ఆకాంక్షించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఈటల రాజేందర్‌ను అభినందిస్తూ పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇద్దరు మంత్రులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణ, చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo