శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 11:58:33

గ్రంథాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

గ్రంథాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్‌ : పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుంది. నిరంతర అధ్యయనంతో లోక జ్ఞానం పెరుగుతుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. 100 స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొర్రూరు మండలం అమ్మాపురంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. వారు పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానంతో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. మనం సంపాదించిన దాంట్లో కొంత ఇతరులకు దానం చేయాలన్నారు. 

లాక్ డౌన్ సమయంలో నేను కూడా నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశాను. రెండు అంబులెన్స్ లు ఇచ్చాను. అలా పంపిణీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. యువత కూడా సంఘ సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమ్మాపురం గ్రామంలో యువత, విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.