బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 17:25:27

జీలుగు విత్తనాలతో భూసారం

జీలుగు విత్తనాలతో భూసారం

జీలుగు విత్త‌నాలు వేసి భూసారాన్ని కాపాడాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రైతుల‌కు పిలుపునిచ్చారు. తొర్రూరులో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం లో జీలగు విత్తనాల అమ్మకాన్ని మంత్రి ప్రారంభించారు. ఎరువులు, క్రిమి సంహార‌క మందుల‌తో భూసారం త‌రుగుతుంద‌న్నారు. భూసారాన్ని కాపాడాలంటే జీలుగుకంటే మెరుగైన సాధ‌నం లేద‌న్నారు. అదిక దిగుబ‌డులు రావాల‌న్నా, నాణ్య‌మైన పంట‌లు పండాల‌న్నా, జీలుగుని వాడాల‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్, మండల రైతు బంధు కో ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి,  గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రామిని శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీనివాస్, న‌ట్వ‌ర్, రేవతి శంకర్, ప్రవీణ్ రాజు, సంపత్, ఎఓ కుమార్ యాదవ్ , ఎఇఓ, లు, రైతులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


logo