శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 12:18:28

జననేత కేటీఆర్‌.. యువతకు స్ఫూర్తి ప్రదాత : మంత్రి ఎర్రబెల్లి

జననేత కేటీఆర్‌.. యువతకు స్ఫూర్తి ప్రదాత : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పర్వతగిరిలోని తన ఇంటి ఆవరణలో దయాకర్‌రావు తన భార్య ఉషాతో కలిసి మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజాసేవకే అంకితమయ్యే జననేత కేటీఆర్‌.. నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. కేటీఆర్‌ ప్రజాజీవితం సుదీర్ఘంగా, సులక్షణంగా భావితరాలకు బాసటగా నిలవాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు కేటీఆర్‌ వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.logo