అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : రాష్ర్టంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పలు సంఘాల ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక బలహీనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాలకు వర్తించే విధంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయా సంఘాల ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తేనే, సమాజం సమ తూకంగా ఉంటుందన్నారు. సమసమాజం సాధించే దిశగానే సీఎం కేసీఆర్ ఆర్థిక బలహీనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు విద్యా, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు పొందని వైశ్య, రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, మార్వాడీ జైన్, ముస్లీం మైనార్టీల్లో సయ్యద్, ఖాన్ మొదలైన వర్గాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం అభినందనీయం : మంత్రి ఎర్రబెల్లి
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఇప్పుడున్న రిజర్వేషన్లను యథాతథంగా ఉంచుతూనే, రాష్ట్రంలో ఆర్థికంగా బలహీనులైన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. తాజా నిర్ణయంతో ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న అగ్రకులాల వారికి ఎంతో ఊరట కలుగుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని ఆయన అన్నారు. ఈ నిర్ణయం పట్ల అన్ని సామాజిక వర్గాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
తాజావార్తలు
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్
- స్టాఫ్‌నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు