మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 17:07:35

అంబులెన్స్ ల‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

అంబులెన్స్ ల‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వ‌రంగ‌ల్ రూరల్ : ఐటీ, పుర‌పాల‌క‌ శాఖ‌ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బహుమతులు, బొకేలు తేవొద్దు. పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించండని ‘గిఫ్ట్ ఎ స్మైల్’  కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పలువురు ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి ప్రభుత్వ దవాఖానలకు సొంత డబ్బులతో అంబులెన్స్ లను అందజేశారు.

అందులో భాగంగా వ‌రంగ‌ల్  ఉమ్మడి జిల్లా నుంచి దాతలు అందజేసిన 14 అంబులెన్స్ వాహ‌నాలకు గాను నాలుగు వాహ‌నాల‌ను పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు వ‌రంగ‌ల్ లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క‌రోనా బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి 14 అంబులెన్స్ వాహ‌నాల‌ను ఎమ్మెల్యేలు, మేయ‌ర్ త‌దిత‌రులంతా క‌లిసి అందజేశార‌న్నారు. 

వాటిని ఇటీవ‌లే కేటీఆర్ చేతుల మీదుగా కొన్నింటిని  ప్రారంభించామ‌ని పేర్కొన్నారు. కాగా, వ‌రంగ‌ల్ లో ఈ రోజు 4 వాహ‌నాల‌ను ప్రారంభించినట్లు చెప్పారు. మిగ‌తా వాహ‌నాలు కూడా త్వరలోనే అందుబాటులోకి వ‌స్తాయ‌ని మంత్రి వివ‌రించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్కర్, మేయ‌ర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్యేలు ఆరూరి ర‌మేశ్, గండ్ర రమాణారెడ్డితో పాటు ఒద్దిరాజు ర‌విచంద్ర‌, సంతోశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo