శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 08, 2020 , 19:41:09

‘ఉపాధి’ పనులు చేసిన మంత్రి ఎర్రబెల్లి

‘ఉపాధి’ పనులు చేసిన మంత్రి ఎర్రబెల్లి

పర్వతగిరి: కూలీలతో ఓ కూలిగా... జాలీగా గడ్డపార పట్టి, మట్టి పెకిలించి, పెళ్లలు తీసి ఉపాధిహామీ పనులు చేసి అబ్బురపరిచారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ శివారు ఆవకుంట చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన శుక్రవారం పరిశీలించి కొద్దిసేపు కూలీలతో మాట్లాడారు. దాదాపు 500 మంది కూలీలతో కలిసి పనిచేశారు. గడ్డపార పట్టి మట్టిని పెకిలించి పెళ్లలు తీశారు. 

ఉపాధి పనులు ఎలా సాగుతున్నాయని ఆరా తీశారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ఇదే సమయంలో ఉపాధి హామీ పనుల విషయమై జిల్లా కలెక్టర్‌ హరితతో మాట్లాడారు. ఎక్కువ మందితో పాటు కొత్తగా వచ్చిన కూలీలకు కూడా పనులు కల్పించాలని అన్నారు. ప్రతి కూలికి రోజుకు రూ.200 వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల కోసం సీఎం కేసీఆర్‌ రూ. 170 కోట్లను విడుదల చేశారని, అందరికీ ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కూడా ఆకలితో అలమటించొద్దని దయాకర్‌రావు అన్నారు. అనంతరం కూలీలకు మాస్కులను అందజేశారు. మొక్కలకు నీటిని పట్టి కూలీలతో ముచ్చటించారు. మాస్‌ లీడర్‌ దయన్న మంత్రి అవ్వడం మా ప్రాంత అదృష్టమని పలువురు కూలీలు హర్షం వ్యక్తం చేశారు. logo