ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:52:48

వ్యవసాయరంగానికి కేంద్రం మోకాలడ్డు:మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వ్యవసాయరంగానికి కేంద్రం మోకాలడ్డు:మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు: ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తుంటే కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం నాంచారిమడూర్‌, అమ్మాపురం గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణాలకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడు తూ.. కరోనా విషయంలో బీజేపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నదని, మేం ప్రధానిని విమర్శిస్తున్నామా? అని ప్రశ్నించారు. ఉనికి కోసం రాజకీయాలు చేయడం మాని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. దళారుల నుంచి రైతులకు విముక్తి కల్పించడానికే రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.  


logo