శనివారం 06 జూన్ 2020
Telangana - May 22, 2020 , 08:22:30

విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి ఈఆర్‌వో కేంద్రాలు

విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి ఈఆర్‌వో కేంద్రాలు

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునివ్వడంతో విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాలు (ఈఆర్‌వో) తెరుచుకున్నాయి. కరెంటు బిల్లులు చెల్లించేందుకు వీలుగా 60 వరకు ఈఆర్‌వో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇవన్నీ మూతపడ్డాయి. తాజాగా సడలింపులు ఇవ్వడంతో  ఈఆర్‌వో కేంద్రాలను తెరిచి బిల్లులను స్వీకరిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ఈఆర్‌వో కేంద్రాల్లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం  పాటించేలా గదులను ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా మాస్కును తప్పనిసరి చేశారు.  అలాగే ఆన్‌లైన్‌లోనూ బిల్లులు చెల్లించవచ్చు.  టీఎస్‌ఎస్‌సీడీసీఎల్‌ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌, పేటీఎం, బిల్‌డెస్క్‌, టీ వ్యాలెట్‌, టీఏ వ్యాలెట్‌, ఫోన్‌ పేతో పాటు మీ సేవ కేంద్రాలు సైతం అందుబాటులోకి రావడంతో వాటిల్లోనూ బిల్లులు చెల్లించవచ్చు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo