ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం

- అందరికీ అవకాశాలే మా ప్రభుత్వ లక్ష్యం
- ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ వ్యాఖ్య
- పదిశాతం కోటాపై ఓసీ సంఘాల హర్షాతిరేకాలు
- రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు
- సీఎం చిత్రపటానికి పలుచోట్ల క్షీరాభిషేకాలు
ఆర్థికంగా వెనుకబడినవర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పదిశాతం రిజర్వేషన్ల నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఓసీ సంఘాల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సమాజంలో అందరికీ అన్ని అవకాశాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. సమాన అవకాశాలు కల్పిస్తేనే సమాజం సమతూకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగావకాశాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తూ.. కమ్మ, రెడ్డి, వెలమ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఇతర ఓసీ సంఘాల ప్రతినిధులు శుక్రవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రిజర్వేషన్ల నిర్ణయంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సమసమాజం సాధించే దిశగానే సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారని తెలిపారు. ఇప్పటివరకు విద్యా, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు పొందని వైశ్య, రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, మార్వాడీ జైన్, ముస్లిం మైనార్టీల్లో సయ్యద్, ఖాన్ మొదలైన వర్గాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ది మనసున్న ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఉన్నారు.
కేటీఆర్‌కు బ్రాహ్మణ సేవా సంఘం శేషవస్త్రం
బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, వల్లూరి పవన్‌కుమార్, రంగనాథాచార్యులు మంత్రి కేటీఆర్‌కు శేషవస్త్రం బహూకరించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఓసీ సంఘాల ప్రతినిధులు గోపు జయపాల్‌రెడ్డి, కేశవరెడ్డి, పోలాడి రామారావు, చెన్నమనేని నాగేశ్వర్రావు, పురుషోత్తమరావు, పర్వతనేని ప్రసాదరావు, రాజేందర్గుప్తా, శ్రీనివాస్‌గుప్తా తదితరులు రిజర్వేషన్లపై కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రెడ్డి జేఏసీ చైర్మన్ అపమ్మగారి రాంరెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నరసింహారెడ్డి, ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, సుభాశ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వసంతారెడ్డి, నాగమణి రెడ్డి, రాధికారెడ్డి తదితరులు కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
హర్షిస్తూ క్షీరాభిషేకాలు
రిజర్వేషన్లపై హర్షం వ్యక్తంచేస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో భారతీయ వెలమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాటిపెల్లి జగ్గన్న, మనోజ్‌రావు, సభ్యులు అశోక్‌రావు, రమేశ్, ముకుంద్‌రావు, చందన్ తదితరుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రమణారావు, రాకేశ్, మాణికేశ్వర్రావు, శేఖర్‌రెడ్డి, అంజయ్య, రాజేశ్వర్‌రావు, నగేశ్, మనోహర్‌రావు తదితరులు నిజామాబాద్ జిల్లాకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
తాజావార్తలు
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు