శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 16:09:40

టీఆర్‌ఎస్‌ పాలనలోనే అన్ని వర్గాలకు సమ న్యాయం

టీఆర్‌ఎస్‌ పాలనలోనే అన్ని వర్గాలకు సమ న్యాయం

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని  విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భాగ్యనగరానికి పూర్తిస్థాయిలో పతిష్టవంతమైన భద్రత కల్పించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనస్థలిపురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఖమ్మ సంఘం ఆత్మీయ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..2014 కు ముందు తరువాత ఆకతాయిల ఆగడాలపై నగర ప్రజలు ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన కోరారు. యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా షీ టీంలు ఏర్పాటు చేసి పోకిరీలకు చెక్ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది కూడా టీఆర్‌ఎస్‌ పాలనలోనే అన్నది విస్మరించకూడదన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


logo