శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 21:55:23

తగ్గిన పీఎఫ్‌ వడ్డీరేటు

తగ్గిన పీఎఫ్‌ వడ్డీరేటు

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ప్రావిడెంట్‌ ఫండ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించింది ఈపీఎఫ్‌వో. దాదాపు 6 కోట్ల ఖాతాదారులను నిరాశపరుస్తూ ఏడేండ్ల కనిష్ఠ స్థాయిలో 8.50 శాతానికే పరిమితం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇది 8.65 శాతంగా ఉన్నది. 2012-13 తర్వాత పీఎఫ్‌ డిపాజిట్లపై కల్పించిన వడ్డీరేట్లతో ఇదే అత్యంత తక్కువ. గురువారం ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ) సమావేశం జరిగింది. ఇందులో పీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 8.65 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో ఈపీఎఫ్‌వోకు రూ.700 కోట్లకుపైగా మిగులు ఉంటుందని చెప్పారు.logo