ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 21:21:46

మియావాకిని సందర్శించిన పర్యావరణవేత్తలు, పక్షి ప్రేమికులు

మియావాకిని సందర్శించిన పర్యావరణవేత్తలు, పక్షి ప్రేమికులు

కరీంనగర్‌ : పలువురు పర్యావరణవేత్తలు, పక్షి ప్రేమికులు, పీస్‌ అండ్‌ వెల్‌ఫేర్‌ కమిటీస్‌ సభ్యులు కరీంనగర్‌లోని మియావాకి అడవిని ఆదివారం సందర్శించారు. సిటీ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(సీటీసీ)లో ఈ మియావాకి అడవిని అభివృద్ధి చేశారు. సీటీసీలో మియావాకి అడవితో పాటు, ఫిష్‌ ట్యాంక్‌, నక్షత్ర రాశివనం, వాకింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేశారు. సాధారణ ప్రజలను వారానికి రెండు రోజులు శని, ఆదివారాల్లో అనుమతిస్తున్నట్లు తెలిపారు. వృధాగా ఉన్న భూమిని ఏ విధంగా ప్రయోజనకరంగా, సారవంతమైన భూమిగా మార్చింది ఈ సందర్భంగా సీటీసీ అధికారులు వివరించారు. 


logo