బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 02:41:57

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

  • రవాణాశాఖ కార్యాలయంలో మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆరోవిడుత హరితహారంలో భాగంగా గురువారం ఖైరతాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌లో ఆయన మొక్కలు నాటారు. ‘జంగిల్‌ బచావో.. జంగిల్‌ బడావో’ నినాదంతో ప్రభుత్వం అమలుచేస్తున్న హరితహారంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పువ్వాడ పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లోని ప్రాంతీయ రవాణా కార్యాలయం హరిత ప్రాంగణానికి నిలువెత్తు దర్పణంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, జేటీసీలు పాండురంగానాయక్‌, రమేశ్‌, మమత ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


logo