సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 11:54:26

హరితహారంతో పర్యావరణ సమతౌల్యం : మంత్రి ఎర్రబెల్లి

హరితహారంతో పర్యావరణ సమతౌల్యం : మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్ : తెలంగాణ తరహాలో మొక్కలు నాటే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఆరో విడత హరితహారంలో భాగంగా జిల్లాలోని తొర్రూరు మండ‌లం మడిపల్లి గ్రామంలో గల కపిల్ హోమ్స్ , తొర్రూరు పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఎదురుగా కేజీవీబీ స్కూల్లో మొక్కలు మంత్రి మొక్కలు నాటారు. అలాగే తొర్రూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి బిల్డింగ్ లో డాక్టర్లకు పీపీఈ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు.

సీఎం కేసీఆర్ సాహసంతో వాతావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు మొక్కలు నాటుతున్నారని తెలిపారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. అధికారులు లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి. నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజాప్రతినిధుల మీద చర్యలు తప్పవని హెచ్చరించారు. మంకీ ఫుడ్ కోర్టుల తో కోతుల బాధ తీరుతుందన్నారు. వైకుంఠ ధామాలు, స్కూల్స్, డంప్ యార్డులు, మొక్కలకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. logo