శనివారం 04 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 07:42:28

అక్టోబరు 31లోగా ప్రవేశాలను పూర్తి చేయాలి

అక్టోబరు 31లోగా ప్రవేశాలను పూర్తి చేయాలి

హైదరాబాద్‌ : కేంద్ర పశు సంవర్ధక శాఖ రాష్ట్ర పశు సంవర్ధక శాఖలకు పలు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 31వ తేదీలోగా  రాష్ట్రాల పరిధిలో పశువైద్య(బీవీఎస్సీ), మత్స్యశాఖ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను పూర్తిచేయాలని ఆదేశించింది.

పరీక్షలు రాయకున్నా మొదటి, రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులను పైతరగతులకు అనుమతించాలని తెలిపింది. ఆన్‌లైన్‌లో నిర్వహించే క్లాసులు, సెమినార్లకు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ కింద 40శాతం మార్కులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది.


logo