సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 20:02:12

అక్టోబ‌ర్‌ 18న‌ ఎన్ఐఎన్ అప్లైడ్ న్యూట్రిషన్ ప్ర‌వేశ ప‌రీక్ష

అక్టోబ‌ర్‌ 18న‌ ఎన్ఐఎన్ అప్లైడ్ న్యూట్రిషన్ ప్ర‌వేశ ప‌రీక్ష

హైద‌రాబాద్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) లో ఎంఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్) -2020 కోర్సు ప్రవేశ పరీక్ష అక్టోబర్ 18న జ‌ర‌గ‌నుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు న‌గ‌రంలోని తార్నాకాలో గ‌ల‌ ఎన్ఐఎన్ క్యాంపస్‌లో ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌. అభ్య‌ర్థులు ఫేస్ మాస్క్, హాల్ టికెట్, తల్లిదండ్రులు సంతకం చేసిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం, ఫోటో గుర్తింపు కార్డు, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్, వాటర్ బాటిల్, పరీక్ష ప్యాడ్ త‌మ వెంట తెచ్చుకోవాలి. అదేవిధంగా పరీక్ష ప్రారంభానికి కనీసం రెండు గంటల ముందు అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాలి. ఈ మెయిల్ ద్వారా అభ్య‌ర్థుల‌కు హాల్ టిక్కెట్లు పంపించ‌నున్న‌ట్లు వ‌ర్సిటీ అధికారులు తెలిపారు. ఏదైనా స‌మాచారం కోసం www.nin.res.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా సూచించారు. 


logo