బుధవారం 03 జూన్ 2020
Telangana - May 23, 2020 , 17:01:35

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఇతర అధికారులు సమావేశమై ప్రవేశ పరీక్షల తేదీలపై చర్చించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే న్విహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

  • జులై 6వ తేదీ నుంచి 9 వరకు ఎంసెట్‌
  • జులై 1న పాలిసెట్‌
  • జులై 4న ఈసెట్‌
  • జులై 13న ఐసెట్‌
  • జులై 15న ఎడ్‌సెట్‌
  • జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌
  • జులై 10న లాసెట్‌, లా పీజీసెట్‌


logo