శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:36:08

వరి ఉత్పత్తుల ఎగుమతిపై అధ్యయనం

వరి ఉత్పత్తుల ఎగుమతిపై అధ్యయనం

ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులకు వినోద్‌ సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సమృద్ధిగా పండిన వరి పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న పరిస్థితులు, మార్కెటింగ్‌ అంశాలపై లోతుగా పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ప్రతినిధులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ కోరారు. బుధవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో వినోద్‌ను ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్‌ ఇనాని, ఉపాధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, అనిల్‌అగర్వాల్‌ కలిశారు. వరితోపాటు పత్తి ఉత్పత్తులకు విదేశీ మార్కెట్‌లో డిమాండ్‌ కల్పించేందుకు చొరవచూపాలని ప్రతినిధులకు వినోద్‌ సూచించారు. 20 ఏండ్ల క్రితం ఫెడరేషన్‌ కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ వద్ద రెండువేల గజాల స్థలం మంజూరుకాగా, డబ్బు చెల్లించామని, కానీ ఆ స్థలం కోర్టు వివాదాల్లో ఉన్నదని ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు వినోద్‌కుమార్‌కు తెలిపారు. వేరే స్థలం ఇప్పించే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తిచేశారు. 


logo