మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 12:32:13

వాడపల్లి చెక్‌పోస్టు ద్వారానే ఏపీలోకి ప్రవేశం

వాడపల్లి చెక్‌పోస్టు ద్వారానే ఏపీలోకి ప్రవేశం

నల్లగొండ : నల్లగొండ జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునే వారు వాడపల్లి మీదుగానే వెళ్లాల్సిందిగా మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాచర్ల మీదుగా వాహనాలను, ప్రయాణికులను అనుమతించడం లేదన్నారు. నాగార్జునసాగర్‌ దాటిన తర్వాత ఆంధ్రాలోకి ప్రవేశించే మాచర్ల చెక్‌పోస్టును ఆంధ్రా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టుగా గుర్తించడం లేదని తెలిపారు. మాచర్ల మీదుగా ఆంధ్రాలోకి వెళ్లాలనుకునే ప్రయాణికులు, వాహనాలు వాడపల్లి మీదుగా వెళ్లాల్సిందిగా సూచించారు. నాగార్జున సాగర్‌ మీదుగా వెళ్లడానికి వచ్చి ఆంధ్రా చెక్‌పోస్టు వద్ద ఇబ్బందులు పడొద్దని పేర్కొన్నారు.


logo