ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 13:35:47

ఎండ తాకేలా.. వ్యాయామం ఉండేలా చూసుకోండి : బొంతు రామ్మోహ‌న్‌

ఎండ తాకేలా.. వ్యాయామం ఉండేలా చూసుకోండి : బొంతు రామ్మోహ‌న్‌

హైద‌రాబాద్ : కోవిడ్‌-19పై యుద్ధంలో శ‌రీరానికి ఎండ త‌గిలేలా, ఒంటికి వ్యాయామం ఉండేలా చూసుకోవాల‌ని హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అన్నారు. కోవిడ్‌-19 పాజిటివ్ అనంర‌తం క్వారంటైన్‌లో ఉన్న మేయ‌ర్ ఈ సంద‌ర్భంగా త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. న‌మ్మ‌కం కోల్పోవ‌ద్ద‌న్నారు. వ్యాధి నుంచి కోలుకోవ‌డానికి వైద్యులు సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూనే శ్వాస సంబంధ‌ వ్యాయామాలు చేయాల‌న్నారు. ఎటువంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయ‌న గ‌డిచిన నాలుగు రోజులుగా ఐసోలేష‌న్‌లో ఉంటున్నారు.

క‌రోనాపై యుద్ధంలో న‌మ్మ‌క‌మే ప్రాథ‌మిక మందు అని అన్నారు. ప్ర‌జ‌లు విశ్వాసాన్ని కోల్పోకుండా వైద్యులు స‌ల‌హాల మేర‌కు మ‌సులుకోవాల‌న్నారు. క్రమం తప్పకుండా మందులు వాడాల‌న్నారు. డాక్ట‌ర్ల‌ అభిప్రాయం ప్రకారం నగరంలో చాలా మంది విట‌మిన్‌-డి, విట‌మిన్ బి-12 లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ లోపాన్ని అధిగ‌మించేందుకు ప్రజలు ప్రతిరోజూ ఉదయం సూర్యకాంతిలో కనీసం 15 నిమిషాలు గడపాలని సూచించారు. అదేవిధంగా ఉదయం 30 నిమిషాలు శ్వాస సంబంధ‌ వ్యాయామాలు, ఇతర వ్యాయామాలను చేయాలని కోరారు. దీంతో పాటు పోష‌కాహారాన్ని తీసుకోవాల‌న్నారు. 


logo