e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home News హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: నగర శివార్లలోని మైసమ్మగూడలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. జనగామ జిల్లాకు చెందిన కొయేటి మాధవి (20).. మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నది. కాలేజీకి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నది. అయితే శుక్రవారం రాత్రి హాస్టల్‌ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గుర్తించిన హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement