గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 16:43:27

ఇంజినీరింగ్ చివ‌రి విడుత సీట్ల కేటాయింపు పూర్తి

ఇంజినీరింగ్ చివ‌రి విడుత సీట్ల కేటాయింపు పూర్తి

హైద‌రాబాద్ : రాష్ర్టంలో ఇంజినీరింగ్ ప్ర‌వేశాల కౌన్సెలింగ్ పూర్తయింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు చివ‌రి విడుత సీట్ల కేటాయింపు పూర్త‌యిన‌ట్లు ఎంసెట్ క‌న్వీన‌ర్ ప్ర‌క‌టించారు. రాష్ర్టంలో 181 కాలేజీల్లో 50,884 సీట్లు భ‌ర్తీ కాగా, క‌న్వీన‌ర్ కోటాలో ఇంకా 19,726 సీట్లు మిగిలాయి. 12 యూనివ‌ర్సిటీలు, 26 ప్ర‌యివేటు కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్లు భ‌ర్తీ అయ్యాయి. ఒక్క సీటు కూడా భ‌ర్తీ కానీ ప్ర‌యివేటు ఇంజినీరింగ్ కాలేజీలు మూడు మాత్ర‌మే. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ కోటా సీట్లు కేవ‌లం 4.2 శాతం మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయి. చివ‌రి విడుత‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 17వ తేదీ లోగా క‌ళాశాల‌ల్లో చేరాల‌ని క‌న్వీన‌ర్ సూచించారు.