సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 01:40:33

డిటెన్షన్‌కు స్వస్తి

డిటెన్షన్‌కు స్వస్తి

పీవీ చదువుల బిడ్డ. క్లాస్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేవారు. చదువు అనేది విజ్ఞానం సంపాదించడానికి అక్కరకు రావాలని బలంగా నమ్మేవారు. అందుకే, అన్ని విషయాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేవారు. తన విషయంలోనే కాదు.. అందరి విషయంలో ఇలాగే ఉండాలని అనేవారు. అందుకే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠశాల విద్యలో డిటెన్షన్‌ విద్యా విధానాన్ని రద్దు చేసి, పదో తరగతికి కామన్‌ పరీక్షలను ప్రవేశపెట్టారు. తద్వారా పరీక్షల్లో సామూహికంగా జరిగే ‘కాపీ’ పద్ధతిని అరికట్టేందుకు కృషి చేశారు. పై తరగతులకు వెళ్లకుండా అడ్డుకొనే డిటెన్షన్‌ విధానం అనేది విద్యార్థుల అభ్యున్నతికి గొడ్డలిపెట్టుగా వర్ణించేవారాయన. 

మార్కులు ముఖ్యం కాదని, తెలివి కోసమే విద్య నేర్చుకోవాలని ఆయన అనేవారు. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు వ్యాపార సంస్థలు కాకూడదని, ధనార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలు నడపకూడదని ఆయన వక్కాణించేవారు. విద్యావ్యవస్థలో పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చిన పీవీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గురుకులాలు, దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను స్థాపించిన విషయం తెలిసిందే.logo