ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:47:28

విద్యుత్‌ వాహనాలకు ప్రోత్సాహం

విద్యుత్‌ వాహనాలకు ప్రోత్సాహం

  • ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ వెల్లడి

మాదాపూర్‌: ఎలక్ట్రిక్‌ వాహనాలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఉత్పత్తి రంగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ తెలిపారు. ఆదివారం సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి సంస్థ ఎవోలెట్‌కు చెందిన 3 రకాల ఎలక్ట్రిక్‌ బైక్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎవోలెట్‌ కంపెనీ వృద్ధి చెందడానికి తగినన్ని అవకాశాలు ఉన్నాయని, సంస్థ మోడళ్లు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. కరోనా తర్వాత కూడా బైక్‌ల మార్కెట్‌ దేశంలో యథాతథంగా ఉండటం మంచి పరిణామమన్నారు. తెలంగాణలో 400 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కును తీసుకురావడం గర్వకారణమని చెప్పారు. 


logo