సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 23:05:37

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రానిక్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ సొల్యూషన్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదేవిధంగా సెక్రటేరియట్‌ నూతన భవన సముదాయం డిజైన్లను మంత్రివర్గం ఆమోదించింది.  

కరోనా వ్యాప్తి, కరోనా రోగులకు అందుతున్న చికిత్స, వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై కేబినెట్‌ విస్తృతంగా చర్చించింది. వైద్యాధికారులు కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌కు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు పాకిన కరోనా ప్రస్తుతం పెద్దనగరాల్లో తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు తక్కువగా.. కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.


logo