మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 18:15:56

పోలీసులు,మావోయిస్టుల‌ మధ్య ఎదురుకాల్పులు

పోలీసులు,మావోయిస్టుల‌ మధ్య ఎదురుకాల్పులు

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మ‌హాదేవ‌పూర్ ప‌లిమెల అట‌వీప్రాంతంలో గ్రేహౌండ్స్ సిబ్బంది మంగ‌ళ‌వారం కూంబింగ్ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా కూంబింగ్ సిబ్బందికి‌, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు త‌ప్పించుకుపోగా సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి ఓ తుపాకి, కిట్టు బ్యాగుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల ఘ‌ట‌న‌ను కాటారం డీఎస్పీ బోనాల కిష‌న్ ద్రువీక‌రించారు.